DOUBLE DECKER BUS: హైదరాబాదీలకు డబల్ ధమాకా… ఆ బస్సుల్లో జర్నీ ఫ్రీ ఫ్రీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOUBLE DECKER BUS: ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. నగరానికి వచ్చే ప్రజలు వాటిని ఆసక్తిగా చూడటమే కాకుండా వాటిలో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. కాలక్రమంలో ఆ బస్సులు మాయమయ్యాయి. అయితే ఆ బస్సులను వెనక్కి తెస్తే బాగుంటుందని కొన్నాళ్లుగా నెటిజన్లు మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో అడుగుతున్నారు. నెటిజన్ల వినతికి ఓకే చెప్పిన మంత్రి కేటీఆర్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తెస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. రూ. 12 కోట్లతో హెచ్‌ఎండీఏ సహకారంతో నగరంలో మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.
ఈ డబుల్ డెక్కర్ బస్సులు రెండు నెలల నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లలో తిప్పుతున్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9:30 వరకు నడుస్తాయి. ‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులు ఉచితంగా తిరుగుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ఈ బస్సులు ఏయే రూట్లలో నడుస్తున్నాయో తెలియక జనం ఎక్కలేకపోతున్నారు. సరైన రూట్ మ్యాప్ ఉంటే ప్రయాణికులు ఎక్కేందుకు ఆసక్తి చూపుతారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
Read also: Warangal News: 24 అంతస్తుల్లో వరంగల్ హెల్త్ సిటీ! ప్రత్యేకతలు ఇవే
ఈ నేపథ్యంలో పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేసింది. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదు, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్క్, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో తిరుగుతాయి. ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు. ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్క్ వద్ద చార్జింగ్ కోసం ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేసినట్లు హెచ్ ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ బస్సుల్లో ప్రయాణం ఉచితం. టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు. కొద్దిరోజుల తర్వాత మినిమమ్ ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే టికెట్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనేది ఇంకా ఖరారు కాలేదు. పర్యాటకుల స్పందన మేరకు మరికొన్ని మార్గాలను ఎంపిక చేయనున్నారు.
I have many fond memories of riding the double decker bus on my way to St. George’s Grammar School at Abids 😊
Not sure why they were taken off the roads. Any chance we can bring them back Transport Minister @puvvada_ajay Garu? https://t.co/ceEGclQLFz
— KTR (@KTRBRS) November 7, 2020
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..