Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa: రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వేదికగా అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని సీఎం వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ 30 నెలల ప్రజాపాలనలో అన్నదాతలు ఎల్లప్పుడూ తలెత్తుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యవసాయం దండగ కాదని, దానిని ఒక పండుగగా భావించేలా రాష్ట్రంలో అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజాగా ఈ రోజు 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలుకు సంబంధించిన అధికారిక లెక్కలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన రెండవ దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1,590.02 కోట్లు జమ అయ్యాయి. అంతకుముందు మొదటి దశలో భాగంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 2,482 కోట్లను జమ చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 54.96 లక్షల మంది రైతులకు చెందిన 67.87 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లింపులు జరిగాయని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం రూ.4,072.04 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు.
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!