August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
August Movies Release: 2026లో తొలి అర్ధభాగంలో సంక్రాంతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు. జూన్, జూలై నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. మరికొన్ని డివైడ్ టాక్ వచ్చినా నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు నెలపై పడింది. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు నెలలో వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ పలు చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. ఆగస్టు 7న మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘కోకా’ (కోరియన్ కనకరాజు) విడుదల కానుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అదే రోజున మరో యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీ చిత్రం కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది.
ఇదే సమయంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆగస్టు 14న పలు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కోర్ట్ రూమ్ డ్రామా ‘పళ్ళ బురుసు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న హారర్ మూవీ ‘అగధ’ కూడా రిలీజ్ కానుంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ కూడా ఆగస్టు 14న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొలుత బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా భావించినప్పటికీ.. ఇది తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read
మాస్ మహారాజా రవితేజ కొత్త లుక్‌లో కనిపించనున్న చిత్రం ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఆగస్టు 28న రావాల్సిన శర్వానంద్ ‘భోగి’ విడుదలపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ విడుదల కాకపోవడంతో.. అనుకున్న తేదీకి సినిమా వచ్చే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టులో తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా భారీ పోటీ ఇవ్వనున్నాయి. తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాతో పాటు సూర్య చిత్రం, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ ఆగస్టు 20న విడుదల కానుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘ఖలీఫా’ కూడా తెలుగు విడుదలపై ఆసక్తి నెలకొంది. ఆగస్టు చివరి వారంలో స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న యష్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మొత్తంగా చూస్తే.. ఆగస్టు నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కీలకంగా మారనుంది. ప్రతి వారం కొత్త సినిమాలు పోటీ పడుతుండటంతో మూవీ లవర్స్‌కు భారీ ఎంటర్టైన్మెంట్ అందనుంది. మరి ఈ పోటీలో ఏ సినిమాలు విజయం సాధిస్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!