Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: భారత క్రికెట్లో అత్యంత ప్రశాంతమైన, నిబద్ధత కలిగిన ఆటగాళ్లలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా, టెస్ట్ కెప్టెన్‌గా కూడా భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. అయినప్పటికీ, అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం పూర్తిగా దక్కలేదని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అజింక్య రహానే రిటైర్మెంట్ అనంతరం ఓ పత్రికలో రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా భారత జట్టుకు రహానే చేసిన సేవలను గుర్తు చేస్తూ, అతని కృషికి తగిన స్థాయిలో ప్రశంసలు దక్కలేదని పేర్కొన్నారు. భారత క్రికెట్లో ఇదే పరిస్థితి చాలామంది గొప్ప ఆటగాళ్లకు ఎదురైందని వ్యాఖ్యానించారు.
రాహుల్ ద్రవిడ్‌తో రహానేను పోల్చిన గవాస్కర్, ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించినప్పటికీ, ఆయనకు రావాల్సిన గుర్తింపు కూడా పూర్తిగా రాలేదని గుర్తు చేశారు. జట్టు విజయం సాధించినప్పుడు వ్యక్తిగతంగా రాణించిన ఆటగాళ్లే ఎక్కువ ప్రశంసలు అందుకుంటారని, కానీ ఓటమి ఎదురైతే కెప్టెన్, కోచ్‌లపై విమర్శలు కేంద్రీకృతమవుతాయని భారత క్రికెట్ సంస్కృతిపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇక, టెస్ట్ కెప్టెన్‌గా అజింక్య రహానే రికార్డు అద్భుతమని గవాస్కర్ కొనియాడారు. రహానే నాయకత్వంలో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించగా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అయినప్పటికీ, అతని నాయకత్వానికి దక్కాల్సిన స్థాయిలో ప్రశంసలు రాలేదని అన్నారు.
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
2020-21 ఆస్ట్రేలియా పర్యటనను ప్రస్తావిస్తూ గవాస్కర్ ఆసక్తికర విషయాలను గుర్తుచేశారు. అడిలైడ్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడం జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన తొలి సంతానం సందర్భంగా స్వదేశానికి తిరిగి రావడంతో రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారని చెప్పారు. మెల్బోర్న్ టెస్టులో రహానే అద్భుతమైన సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, పలువురు కీలక ఆటగాళ్లు గాయపడినా యువ ఆటగాళ్లను సమర్థంగా నడిపించి ఆస్ట్రేలియాలోని గబ్బా మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని అందించి 2-1తో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకునేలా చేశారని కొనియాడారు.
రహానే వ్యక్తిత్వాన్ని కూడా గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సుదీర్ఘ కెరీర్లో మైదానంలో ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా అందరి గౌరవాన్ని సంపాదించుకున్న అరుదైన ఆటగాళ్లలో రహానే ఒకరని పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్లో తమ కెరీర్ మొత్తం ముగిసే వరకు ఒక్క శత్రువును కూడా సంపాదించుకోని ఆటగాళ్లు చాలా తక్కువమందే ఉంటారని, ఆ జాబితాలో అజింక్య రహానే స్థానం ప్రత్యేకమని అన్నారు. అందుకే రహానే తలెత్తుకుని గర్వంగా క్రికెట్‌కు వీడ్కోలు చెప్పగలిగాడని గవాస్కర్ తన కాలమ్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?