రాయలసీమ ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతుల్లేవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమ ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతుల్లేవు అని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి… కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలు, ఏపీ నేతల విమర్శలపై హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలాంటి అనుమతులు లేకున్నా.. ఏపీ ప్రభుత్వం కృష్ణ నది నీటిని తరలించే ప్రాజెక్టు పనులు చేస్తోందని విమర్శించారు.. అక్రమంగా కృష్ణ నీటిని తరలించే పనిని ఏపీ సర్కారు మొదలుపెట్టిందని ఫైర్ అయిన ఆయన.. అక్రమ నీటి తరలింపుతో
పాలమూరు, రంగారెడ్డి, మెదక్ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. మేం ఎలాంటి పనులు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు అబద్ధం చెబుతోందని ఆరోపించారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ఇక, కృష్ణ బోర్డు.. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపాలని ఆదేశించిందన్నారు.
also read ఏపీ కరోనా అప్‌డేట్..
Also Read
మరోవైపు.. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకులు నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. కృష్ణ బోర్డు ఆదేశాలపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం చెబుతారు? అని ప్రశ్నించిన ఆయన.. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కు ఎటువంటి అనుమతులు లేవన్నారు.. సక్రమమైతే పనులు ఆపాలని కేఆర్‌ఎంబీ ఎందుకు ఆదేశాలిస్తుంది? అని ప్రశ్నించారు.. ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన ఏడు రోజుల్లోనే కృష్ణాబోర్డుకు లేఖ రాశామని.. సర్వే అని చెప్పి పనులు మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. ఇక, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిందే కాంగ్రెస్ హయాంలో అన్నారు మంత్రి.. పోతిరెడ్డిపాడు కాల్వల ప్రారంభానికి డీకే అరుణ హారతి పట్టారని, పొన్నాల లక్ష్మయ్య కొబ్బరికాయ కొట్టారని గుర్తుచేశారు. కుడి కాలువ పనులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను డిమాండ్ చేశారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. కాగా, గత కొంతకాలంగా కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!