ఏపీ కరోనా అప్‌డేట్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 88,622 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,981 మంది పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ బారినపడి మరో 38 మంది మృతిచెందారు.. తాజాగా మృతుల్లో చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పు. అనంతపూర్‌, కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

also read వారిపై లీగల్ యాక్షన్… వైఎస్‌ షర్మిల పార్టీ నేతల హెచ్చరిక

ఇక, గత 24 గంటల్లో ఏపీలో 6,464 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు 18,64,122కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 18,01,949కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,490 మంది మరణించగా.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 49,683గా ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,14,49,636కి చేరింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-