పోలీసులకు ఓ వెరైటీ ఫిర్యాదు అందింది.. ఈ తరహా ఘటనలు తమ దృష్టికి రావడం మొదటి సారి అంటున్నారు పోలీసులు.. ఎందకంటే.. ఇప్పటి వరకు దొంగలు పడ్డారు, నన్ను దోచుకున్నారు, ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు, కారు పోయింది, బైక్ పోయింది.. ఇంకా రకరకాల ఫిర్యాదులు పోలీసులకు అందాయి.. అందులో కొన్ని పరిష్కారం అయితే, మరికొన్ని ఎటూ తేలకుండా పోయిన కేసులు కూడా లేకపోలేదు.. అయితే, రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన ఎలుక పోయిందంటూ ఫిర్యాదు చేసి ఇప్పుడు సోషల్ మీడియాకు పనిచెప్పారు..
Read Also: Astrology : అక్టోబర్ 03, సోమవారం దినఫలాలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బాంసవాఢా జిల్లా సజ్జన్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన మంగు అనే 62 ఏళ్ల వ్యక్తి.. పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.. తాను పెంచుకుంటున్న ఎలుక కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.. ఆ ఎలుక కలర్, బరువుకు సంబంధిచిన కొన్ని గుర్తులకు కూడా చెప్పారు.. తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి కనిపించడం లేదు.. ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.. అంతే కాదండోయే.. తన ఎలుకను వారే ఎత్తుకెళ్లిఉంటారంటూ.. తన సోదరుడి ముగ్గురు కుమారులైన సురేష్, మోహిత్, అరవింద్ పై అనుమానం వ్యక్తం చేశాడు.. ఎలుక మిస్సింగ్‌పై కేసు నమోదు చేసేందుకు మొదట నిరాకరించారు పోలీసులు.. అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ, అతడు ఎంతకీ వినకపోవడంతో.. చివరకు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్న ముగ్గురి పేర్లను చేర్చి నిందితులుగా పేర్కొన్నారు.. ఐపీసీ 457, 380 కింది కేసు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను విచారణకు పిలిచామని తెలిపారు సజ్జన్‌గఢ్ పోలీసు అధికారి ధన్‌పత్ సింగ్. అయితే, ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అంటున్నారు పోలీసులు.. గతంలో పెంపుడు కుక్కలు, పిల్లులు తప్పిపోయాంటూ పోలీసులను ఆశ్రయించడం.. పోస్టర్లు, కరపత్రాలు వేసి మరీ.. తమ తప్పిపోయిన జంతువులను అప్పగిస్తే.. డబ్బులు ఇస్తామంటూ ప్రకటనలు చేసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.