ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన వుదయం తెలిసిందే. అయితే ఈ పెట్రోల్ పెట్రోల్ సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ కేంద్ర ప్రజల పై భారం మోపుతోంది అని అంటుంది. కానీ కేంద్రం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకుంటే సరిపోతుంది అని అంటుంది. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో ఈ విషయం పై మాట్లాడుతూ… నిన్ను ఇక్కడ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన తర్వాత నేను రెండు శాతం పన్నును అక్కడ తగ్గించాను. 6 నెలల కిందటే ఇది జరిగింది. పుదుచ్చేరి లో మేము 2.90 రూపాయలు పెట్రోల్ పై తగ్గించము. ప్రత్యేక్షంగా నేను అది చేశాను. ఒక గవర్నర్ కంటే లెఫ్టినెంట్ గవర్నర్ కు భయతలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పైన పన్ను తగ్గిస్తే.. ధరలు కూడా తగ్గుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉన్నాయి. అందుకే వారు పన్ను తగ్గించలేకపోతున్నారు. ఈ విషయం పైన సీఎంకు నేను సలహాలు ఇవ్వలేను కానీ రిక్వెస్ట్ చేయగలను అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.