Telangana Govt: కొత్తగా 466 అంబులెన్స్‌లు.. ఆగస్టు 1న ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: తెలంగాణలో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం 466 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.వీటి స్థానంలో పాత వాహనాలు, కాలం చెల్లిన అంబులెన్స్‌లను ప్రవేశపెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కొత్త వాహనాలను సిద్ధం చేసింది. ఇందులో 108 అంబులెన్స్‌లు 204.. 228 అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టి గర్భిణులను దవాఖానకు తీసుకొచ్చి సురక్షితంగా ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే మరో 34 గ్రౌండ్ వెహికల్స్ తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 466 వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి. పాతవి నాసిరకంగా ఉండడంతో అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే వాటి మరమ్మతులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ. దీంతో వాటి స్థానంలో ఇటీవల వైద్యారోగ్యశాఖ కొత్త వాహనాలను కొనుగోలు చేసింది.
Read also: Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
ఇటీవల అంబులెన్స్ సేవలకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌ల పనితీరుపై చర్చించారు. కాలం చెల్లిన అంబులెన్స్‌లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఇవి అత్యవసర సమయాల్లో అత్యవసర సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 426 అంబులెన్స్‌లు 108 సేవలను అందిస్తున్నాయి. వాటిలో 175 వాహనాలను తొలగించనున్నారు. 204 కొత్త అంబులెన్స్‌లతో కలిపి 108 అంబులెన్స్‌ల సంఖ్య 455కి చేరుకోగా.. గర్భిణుల కోసం ప్రత్యేక సేవలు అందించే వాహనాలు 102 ఉండగా.. 300 ఉండగా.. వాటిలో ల్యాప్ అయిన 228 వాహనాలను తొలగిస్తారు. ఇప్పుడు కొత్తగా 228 వాహనాలను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో మృతుల మృతదేహాలను తరలించేందుకు 50 శవవాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 34 వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
Telangana Rians: రాబోయే వారం రోజులు వానల్లేవు.. ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ స్టార్ట్
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!