విద్యార్థులు, విద్యా విధానంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది కరోనా మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడి.. ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేయడమే కాదు.. ఎన్నో పరీక్షలను కూడా రద్దు చేసింది.. కీలకమైన బోర్డు ఎగ్జామ్స్‌కు రద్దు చేసి.. అందరు విద్యార్థులను పాస్ చేసిన పరిస్థితి.. అయితే, ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ… ఎంసెట్ అడ్మిషన్స్, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా, 5 సంవత్సరాల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కి అర్హత.. ఇంటర్ తత్సమాన కోర్సుల్లో మినిమం పాస్ అయితే చాలు అని ప్రకటించింది.. వార్షిక పరీక్షలు జరగకపోవడం… విద్యార్థులను పాస్ మార్క్స్ వేసి పాస్ చేయడంతో.. ఇంటర్‌లో ఇన్ని మార్క్స్ ఉంటేనే అడ్మిషన్స్ కి అర్హులు అనే నిబంధన ఎత్తివేసింది సర్కార్.. అధికారులతో సమావేశం అయిన విద్యాశాఖ కార్యదర్శి.. ఇంటర్ మార్క్స్ నిబంధనపై చర్చించారు.. ఆ తర్వాత నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.