లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపటి క్రితమే విడుదల చేశారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్.. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు వర్తింపజేసేలా నిర్ణయం తీసుకున్నారు.. ఇక, దీనిపై ఇవాళ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.