వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని స్థానిక ఎన్నికల అధికారులు, ఎంపీడీవో రవీందర్ తెలిపారు. Botsa…
Mandakrishna Madiga : ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చట్టసభలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కు అండగా ఉన్నారని, షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారన్నారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని, మేం…
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్…
Legislative Council : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు. మధుసూదనాచారి మాట్లాడుతూ, కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ డేటా వివరాలు ఇప్పటివరకు అందరికీ అందుబాటులో లేవని…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి…
UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది,…
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యాంగం, బాబా సాహెబ్ అంబేడ్కర్, రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు పరస్పరం దళిత వ్యతిరేకులుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో 'రాజ్యాంగం ఎవరు రాశారో వారు మద్యం తాగి రాసి ఉంటారు' అనే కేజ్రీవాల్ చెప్పినట్లు ఉంది.
కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది.
CM Siddaramaiah : ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వైఖరిని స్పష్టం చేశారు.
మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమేళనం నిర్వహించిన నామిడ్ల శ్రీను, వారి బృందానికి నా ధన్యవాదములు తెలిపారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్ట్ తీర్పు లోబడే నేను మాట్లాడుతానని, షెడ్యూల్ కుల వర్గీకరణను నేను మనసా.. వచా కట్టు పడి వుంటానన్నారు.