India crosses 2 Billion corona vaccine doses: కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇండియా కీలక మైలురాయిని చేరుకుంది. పాశ్చాత్య దేశాల వెక్కిరింపుల మధ్య సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసుకుని దేశ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుకునే విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఇండియా వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా ప్రజలకు అందాలంటే దశాబ్ధాలు పడుతుందనే పాశ్చాత్య దేశాలు వ్యాఖ్యల నడుమ..ఇది నయా ఇండియా అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం నుంచి థర్ద్ వేవ్ వచ్చే సరికి మరణాలను దాదాపుగా తగ్గడానికి కారణం వ్యాక్సినేషన్ కార్యక్రమమే.
తాజాగా ఇండియా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటింది. జూలై 17న ఈ కీలకమైలు రాయిని చేరుకుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ 2 బిలయన్ డోసులను అధిగమించడం మాకు గర్వకారణం అని..ఈ ఘనత సాధించినందుకు ఆరోగ్య కార్యకర్తలు, భారత పౌరులను అభిందిస్తున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 21, 2021లో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోగా.. తాజాగా తొమ్మది నెలల తరువాత జూలై 17న 200 కోట్ల మైలురాయిని చేరుకుంది.
Read Also: Corona Cases: ఇండియాలో కరోనా విజృంభన.. కొత్తగా 20 వేలకు పైగా కేసులు
జనవరి 16, 2021న ఇండియాలో తొలివిడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి తొలివిడతలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2021 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తరువాత 2021 ఎప్రిల్ 1 నుంచి దేశంలోని 45 ఏళ్లకు పైబడిన వారికి.. 2021 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ఆరంభం అయింది. 2022 మార్చి 16 నుంచి 12-14 ఏళ్లలోపు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా 2022 జూలై15 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ను ఉచితంగా ఇస్తోంది.