లోక్ సభకు తెలంగాణ వరదల రచ్చ తాకింది. కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోతు వానలు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. దీంతో.. గోదావరి మహోగ్రంగా ఉప్పొంగడంతో గోదావరి తీరం అల్లకల్లోలమైంది. తెలుగురాష్ట్రాల్లో వందలాది గ్రామాలను గోదావరి వరద ముంచెత్తడంతో.. వేలాది మంది ఇళ్లు వదిలి పునరావాసకేంద్రాలకు వెళ్లిపోయారు. అయితే.. వరద మేనేజ్ మెంట్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, జాతీయ రాజకీయాలంటూ సమావేశాలు…
CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్…
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకేరోజు అటు సీఎం కేసీఆర్, ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోనుండగా.. గవర్నర్ రైలు మార్గంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.