కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు..…