కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు..…
భారతదేశ ఇంధన భద్రతకోసం దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు. పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి మరింత కృషి జరగాలని దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. Read Also: కేంద్రం మీద నెపం నెట్టి.. గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం: రాములునాయక్ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు.. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్లెం పడుతుందని అంతా భావించారు.. పెట్రోలియం ఉత్పత్తి చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని.. దీంతో.. పెట్రో ధరలతో పాటు.. పరోక్షంగా ఇతర వస్తువలపై కూడా ప్రభావం చూపుతుందనుకున్నారు.. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో…
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. వాటి ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడుతూ పోతోంది.. అయితే, పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ఓ బిగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న పెట్రో ధరల నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.. త్వరలోనే ప్రజలకు…
పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి.. పెట్రోల్ ఎప్పుడూ సెంచరీ కొట్టేయగా.. డీజిల్ సైతం చాలా ప్రదేశాల్లో సెంచరీని బీట్ చేసింది.. అయితే, ఇప్పట్లో పెట్రోల్‌పై వడ్డింపు ఆగేలా కనిపించడంలేదు.. ఎందుకంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని తెలిపారు.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న నిర్మలా సీతారామన్.. అంతర్జాతీయ…