పంచాంగంలో ఏముందో కానీ సంతోష్ కుమార్ శాస్త్రి నోటి నుండి శుభం మాటలు వచ్చాయి.. వ్యక్తిగతంగా నాకు సంతృప్తిగా ఉంది.. సర్వ జనులకు సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలు సందడిగా జరిగాయి.. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.. సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మనకు జాతి కులం లేదు… తెలంగాణ జాతి అంత ఒక్కటేనని స్పష్టం చేశారు.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం సాధించని అద్భుత ఫలితాలు తెలంగాణ సాధించిందని వెల్లడించారు.. విబేధాలు సృష్టించే పనులు కొన్ని దుష్ట శక్తులు చేశాయి.. వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేసీఆర్..
Read Also: TS: టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీకి గూటికి మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్..!
ఇక, రాష్ట్రంలో అద్భుతమైన సంపద సృష్టి జరిగింది.. భూముల విలువ పెరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి వెళ్లినా భూమి ధర పెరిగిందన్న ఆయన.. హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో విల్లా బుక్ చేసుకునే పరిస్థితి ఉందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి చెందడంవల్లే భూముల ధరలు పెరిగాయని వెల్లడించారు. అన్ని వర్గాలు బాగున్నప్పుడే సమాజం చక్కగా ముందుకు వెళ్తుందన్న ఆయన.. దళిత బంధు అద్భుతాలు అవిష్కరించబోతోందన్నారు.. ఎన్నికల కోసం చేసిన స్టంట్ కాదు.. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇలా తెలంగాణ నుండి చాలా నేర్చుకోవాలన్నారు. దేశానికి అన్నం పెట్టే విధంగాతెలంగాణ ముందుకు వెళ్లాలని ఆకాక్షించిన కేసీఆర్.. దేశంలోనే గొప్ప బ్రాహ్మణులు తెలంగాణలో ఉన్నారని వెల్లడించారు సీఎం కేసీఆర్.