Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu Sana: వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా. రవి తేజ నటించిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో రవి తేజతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఒక విషయం అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను రచయితగా మొదట రాసిన కథను రవి తేజ కోసమే రాశానని బుచ్చిబాబు వెల్లడించారు. ఆ కథను భవిష్యత్తులో తప్పకుండా రవి తేజకు వినిపించాలని అనుకుంటున్నానని కూడా చెప్పారు. ఈ మాటతో సభలో చప్పట్లు మార్మోగగా, రవి తేజ అభిమానులు కూడా ఈ కాంబో నిజమవుతుందా అనే ఆసక్తిని కనబరుస్తున్నారు.
బుచ్చిబాబు సానా ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తెరకెక్కించిన ‘పెద్ది’ మంచి స్పందన అందుకోవడంతో పాటు, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే చర్చ ఇప్పటికే జరుగుతోంది. పలువురు అగ్ర హీరోలతో ఆయన పేరు వినిపించినప్పటికీ, ఇప్పటివరకు ఏ కొత్త ప్రాజెక్ట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇలాంటి సమయంలో రవి తేజ కోసం రాసిన తొలి కథ గురించి ఆయన చెప్పిన మాట మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఆ కథను ఇప్పుడు తెరకెక్కించే నిర్ణయం తీసుకుంటే, మాస్ మహారాజా ఇమేజ్‌కు తగ్గట్టుగా మరో విభిన్నమైన సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, రవి తేజ ప్రస్తుతం ఇరుముడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చిన స్పందనతో పాటు, బుచ్చిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ‘ఇరుముడి’ ప్రచారానికి మరో ఆసక్తికరమైన కోణాన్ని తీసుకొచ్చాయి. ఇక నిజంగానే బుచ్చిబాబు, రవి తేజ కలయిక వెండితెరపై సాకారం అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఇక బుచ్చిబాబు సానా విషయానికి వస్తే.. ‘ఉప్పెన’ తో జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ దర్శకుడు, ఇటీవల రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన ‘పెద్ది’ (Peddi) ఘనవిజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత ఆయన గ్యాప్ తీసుకోకుండా తన మూడో సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో స్క్రిప్ట్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ మాస్ ఎమోషనల్ కథను సిద్ధం చేస్తుండగా, మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరో అఖిల్‌లకు సరిపోయే విభిన్నమైన పాన్-ఇండియా కథలను కూడా లైనప్‌లో ఉంచినట్లు చర్చ జరుగుతోంది. అయితే రవితేజ, బుచ్చిబాబు కాంబో ఒక వేల కుదిరినా, పట్టాలెక్కేది మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు.
- Tags
- buchi babu sana
- cinema
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!