SL vs IND: 462 పరుగులకు భారత్ ఆలౌట్.. తొలి ఓవర్లోనే శ్రీలంకకు భారీ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 460/9 స్కోరుతో ఉన్న భారత్.. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే ఆసిత ఫెర్నాండో భారత చివరి వికెట్‌ను పడగొట్టాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువంత మూడు వికెట్లు, ఆసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశారు.
రెండో రోజు భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 167 పరుగులతో భారీ శతకం చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేఎల్ రాహుల్ 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. వీరి ప్రదర్శనతో భారత్ భారీ స్కోరు చేసింది. భారత్ ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే నిశాన్ ఫెర్నాండో ఔటయ్యాడు. దీంతో ఫెర్నాండో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
Also Read
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
- Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
- Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
- India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ప్రస్తుతం శ్రీలంకపై ఒత్తిడి పెరిగింది. 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 17 రన్స్ చేసింది. గాలె పిచ్‌పై స్పిన్నర్లకు సహకారం లభించే పరిస్థితుల్లో భారత బౌలింగ్ కీలకంగా మారనుంది. లంక ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో.. మూడో రోజు మ్యాచ్ ఎంతవరకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఎంత స్కోరు చేస్తుంది, భారత్ ఎంత ఆధిక్యం సాధిస్తుందన్నది ఈ టెస్టులో కీలకం కానుంది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!