Telangana: ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అయితే అన్ని వ్యాపారాలను మూసివేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతుతో భారీ సంఖ్యలో ప్రజలు ఈ బంద్‌లో పాల్గొంటారని ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. అయితే భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, పాఠశాలలు తెరుస్తాయా అనేది ప్రజలకు ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Read also: Food In Silver Plates: వెండి ప్లేట్లలో ఆహారాన్ని తింటే శరీరంలో ఇన్ని మార్పులను చూడొచ్చా..?
అయితే.. తెలంగాణ రాష్ట్రంలోనూ భారత్ బంద్ కొనసాగుతుంది. కానీ.. భారత్ బంద్ దృష్ట్యా రాజస్థాన్‌లో మాత్రమే పాఠశాలలను మూసివేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వ భవనాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, గ్యాస్ స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రైలు సేవలు, ప్రజా రవాణా, విద్యుత్ సరఫరా వంటి అత్యవసర సేవలు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. మరోవైపు బుధవారం కూడా స్టాక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ విషయంలో, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) బంద్ గురించి ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని అందించలేదు కాబట్టి.. స్టాక్ మార్కెట్లు కూడా సాధారణ రోజుల మాదిరిగానే పనిచేస్తాయి.
Astrology: ఆగస్టు 21, బుధవారం దినఫలాలు