కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు…
Agnipath Scheme Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే దీనికి అనుమతిలేదని, పాల్గొంటే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. అల్లర్లు, విధ్వంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని…
దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా…