Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
- కడియం శ్రీహరి అబద్ధాలు చెబుతున్నారని రాజయ్య విమర్శలు
- కాళేశ్వరం, రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
- ఘనపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్
- కాంగ్రెస్, కమిషన్ల రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ కడియం శ్రీహరి అబద్ధాలు మాట్లాడుతూ ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలన్నీ చిన్నపిల్లల చిలిపి చేష్టలు, కారుకూతల్లాగే ఉన్నాయని మండిపడ్డారు.
కాళేశ్వరం అద్భుతం.. రేవంత్ రెడ్డిది ఆంధ్రకు నీటి దోపిడీ కుట్ర
ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతం, వరప్రదాయని, మానస పుత్రిక అని పొగిడిన కడియం శ్రీహరి, నేడు మాటమార్చి కాళేశ్వరం కాదని కుళేశ్వరం అనడం ఆయన నైజానికి నిదర్శనమని రాజయ్య విమర్శించారు. దేవాదులకు కడియం సృష్టికర్త కాదని, వినాశక కర్త అని ధ్వజమెత్తారు. తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని దోచిపెట్టేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, 16 రిజర్వాయర్లకు నీరందించే కల్పతరువు అని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు చెడ్డపేరు తేవడానికే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఇప్పుడు NDSAకి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
రాష్ట్రంలో రేవంత్ కరువు.. ఘనపూర్‌లో కడియం కరువు
రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపైనా, రైతుల సమస్యలపైనా కనీస అవగాహన లేదని రాజయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన వల్ల కరువు వస్తే, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వల్ల కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. నకిలీ కాంగ్రెస్‌లోకి వెళ్లిన కడియం శ్రీహరి, ఎమ్మెల్యేగా ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కడియం కేవలం కమిషన్లు వచ్చే పనులపైనే దృష్టి పెడతారని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల అంచనాలు పెంచిన చరిత్ర ఆయనదని తీవ్ర ఆరోపణలు చేశారు.
చర్చకు సిద్ధమా? అంబేద్కర్ విగ్రహం వద్దకు రా అని సవాల్
నియోజకవర్గానికి ఎవరు ఎంత చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావలసిందిగా కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. “నేను చేసిన అభివృద్ధి పనులపై, నువ్వు చేసిన పనులపై చర్చకు సిద్ధం.. స్టేషన్ ఘనపూర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలి” అని సవాల్ చేశారు. అలాగే అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పదవులు రాకుండా కడియం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “ఎక్కువ మాట్లాడకుండా కుక్కిన పేనులాగా ఉండు బిడ్డా” అంటూ కడియం శ్రీహరికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?