OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
- తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
- బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ
- వరంగల్ కేంద్రంగా బీఎల్ సంతోష్‌కు సన్నిహిత నేత
- ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలం అంతంతమాత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ బీజేపీ ఫోకస్ షిఫ్ట్ అవుతోందా? తాత్కాలికంగా కార్యక్షేత్రం మారబోతోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ కూడా మొదలవబోతోందా? ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో జరుగుతున్న మార్పులు, నాయకులకు ఇస్తున్న టార్గెట్లు అదే విషయం చెబుతున్నాయా? ఇంతకీ పార్టీ ఎటువైపు సీరియస్‌గా దృష్టి పెట్టింది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?. బీజేపీ తెలంగాణలో ఏ పని చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునేనని అంటున్నారు. పార్టీ చర్యలు, నేతల కదలికలు కూడా ఆ విషయాన్నే చెబుతున్నాయి. రాజకీయంతో పాటు సంస్థాగత బలోపేతంపై కూడా ఏకకాలంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది అధిష్టానం. అందుకే… వీక్‌గా ఉన్న ఏరియాల్లో యాక్టివిటీ పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పావులు కదుపుతోందట. పార్టీ ముఖ్యుడు బీఎల్ సంతోష్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చూసేందుకు వరంగల్ కేంద్రంగా నియమించింది. రాష్ట్రంలో పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా… క్షేత్ర స్థాయిలో అన్ని ప్రాంతాల్లో సమానమైన బలం లేదు. కొన్ని జిల్లాల్లో మంచి ప్రాబల్యం ఉన్నా… మరికొన్ని జిల్లాల్లో ఆ స్థాయి లేదు. ఇంకొన్ని చోట్ల అయితే… అసలక్కడ కాషాయ జెండా ఉనికి ఉందా లేదా అన్న సందేహాలు కూడా వస్తుంటాయి.
ఏటికేడు, ఒక ఎన్నికకు, మరో ఎన్నికకు మార్పు కనిపిస్తున్నా, పార్టీ ఓటు బ్యాంక్ పెరుగుతున్నా… అదంతా బలం ఉన్న దగ్గరే తప్ప… వీక్‌గా ఉన్నచోట్ల ఎప్పటికప్పుడు చతికిలపడుతూనే ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా… అంతకు ముందుతో పోలిస్తే…బాగానే ఓట్లు పడ్డాయని అనుకున్నా… ఆ మూడు ఉమ్మడి జిల్లాలను కలిపితే మేటర్ మొత్తం తుస్సుమంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీజేపీ బలం అంతంతమాత్రంగానే ఉంది. ఈ మూడు జిల్లాలను కలుపుతూ ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఎన్నిక జరగబోతోంది. అందుకే…ఆ ఏరియా మీద పార్టీ ఢిల్లీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ మూడు జిల్లాలతో పాటు రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీ బలాలు, బలహీనతల పై స్టడీ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే… ముందు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బలపడాలన్న నిర్ణయానికి వచ్చారట కాషాయ పెద్దలు. ఇటీవల జరిగిన పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నియామకం కావొచ్చు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు మార్పులు చేర్పులు కావొచ్చు… అవన్నీ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జరిగాయన్నది పార్టీ వాయిస్. తెలంగాణకు సంస్థాగత ప్రధాన కార్యదర్శులుగా తెలుగు వచ్చిన వారిని నియమించింది.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
ఆ పదవిలో నియమితులైన దశరథ్ ను వరంగల్ కేంద్రంగా పెట్టింది. దశరథ్ పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్‌కు అత్యంత సన్నిహితుడన్న పేరుంది. ఆయన పార్టీ వీక్‌గా ఉన్న వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారట. అధిష్టానం ఏరికోరి పంపింది కాబట్టి… దశరథ్ నిర్ణయాలకు విలువ ఉంటుందని అంటన్నాయి కాషాయ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా…పార్టీ క్షేత్ర స్థాయికి వెళ్ళే ఎజెండాతోనే అక్కడ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో… వచ్చే ఏడాది జరిగే పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్లో మార్పు ఉంటుందా అన్నది చర్చనీయాంశమైంది. ఈ నియామకాలు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది కూడా అప్పుడు తెలిసిపోతుందని అంటున్నాయి బీజేపీ వర్గాలు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..