Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Food Safety: హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE – Telangana Standards Authority for Food and Essential Drugs) అధికారులు విస్తృత స్థాయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాణ్యత, పరిశుభ్రత నిబంధనలు పాటించకుండా వినియోగదారులకు కల్తీ, నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదులతో 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో 11 ప్రముఖ రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను అధికారులు రద్దు చేశారు.
లైసెన్సులు రద్దయిన హోటళ్లు, రెస్టారెంట్లు:
మొనాస్టరీ (హైటెక్ సిటీ)
శివానీ రెస్టారెంట్ అండ్ బార్ (గచ్చిబౌలి)
అల్ సబా రెస్టారెంట్ (గచ్చిబౌలి)
లక్కీ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ & సాయిరామ్ మెస్ (మాదాపూర్)
ఉడుపిస్ ఉపహార్ (గచ్చిబౌలి)
కోల్ స్పార్క్
కాంచీ కేఫ్ (హైటెక్ సిటీ)
ఆంతెరా కిచెన్ అండ్ బార్ (గచ్చిబౌలి)
అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్
ఫ్యూజన్ 9 / అమ్నేషియా స్కై బార్ (ఇనార్బిట్ మాల్, మాదాపూర్)
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
అలాగే నిబంధనలు ఉల్లంఘించిన ’63 డిగ్రీస్ మోడర్న్ రీజినల్ బఫెట్’ (గచ్చిబౌలి), మినర్వా గ్రాండ్ (కొండాపూర్), హోటల్ అవాసా (హైటెక్ సిటీ) హోటళ్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల సమయంలో పలు హోటళ్ల వంటశాలల్లో బొద్దింకలు, ఎలుకల సంచారం ఉండటం, బూజు పట్టిన కూరగాయలు ఉపయోగించడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం లాంటి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పక్వాన్ గ్రాండ్లో ఏకంగా 1,170 కేజీల గడువు తీరిన బియ్యాన్ని అధికారులు గుర్తించారు. దీనికి తోడు వంట చేసే సిబ్బంది ఏమాత్రం వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడాన్ని తప్పుపట్టారు. దాడుల సందర్భంగా మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని సమగ్ర విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించారు.
తాజావార్తలు
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!