Tammineni Veerabhadram: కామ్రేడ్స్ రివర్స్ గేర్..! కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన తమ్మినేని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది… అయితే, ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి… కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్ ఉండడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారితో పొత్తుకోసం ప్రయత్నాలు చేశాయి.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్‌కే సాధ్యం.. అందుకే.. తమ మద్దతు.. గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఎం, సీపీఐ.. అయితే, మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను తప్పుబట్టారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. రూ.18,000 కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నికలో విత్ డ్రా చేసుకుంటారా? దేశ అభివృద్ధికి నిధులు ఇస్తున్నా అని మోడీ చెప్తున్నారు.. అయితే మీరు విత్ డ్రా చేసుకుంటారా..? అని ప్రశ్నించారు తమ్మినేని.
Read Also:Kerala Black Magic Case: నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. చంపి వండుకుని తినేసిన భార్యాభర్తలు!
Also Read
- TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
నిధులు ఇస్తే అనే మాటలు.. బీజేపీతో లూజ్ నెస్ ఉంటుంది అనే భావన వస్తుందన్నారు తమ్మినేని వీరభద్రం.. బలహీనత మాటల్లో కనపడుతుంది.. దానిని మేం తప్పుపడుతున్నామన్న ఆయన.. జగదీష్ రెడ్డి అంటే ఏదో అన్నారు లే అనుకోవచ్చు.. కేటీఆర్ కూడా అలాంటి మాటలు మాట్లాడటం సరికాదని హితవుపలికారు.. నిధులు ఇస్తే మీ వైఖరి మార్చుకుంటారా? అని నిలదీశారు వీరభద్రం. ఇక, లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేయాలనే ఉమ్మడి సమావేశం నిర్వహించామని తెలిపారు.. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని స్పష్టం చేసిన ఆయన.. టీఆర్ఎస్ తో కలవాలని కానీ.. వద్దు అనే భావన కానీ మాకు లేదని.. అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు.. కోటమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమ్యూనిస్టులపై అనేక అఘాయిత్యాలు చేశారని మండిపడ్డారు సీపీఎం తెలంగాణ చీఫ్.. క్షుద్రపూజలు, మనుధర్మం.. చరిత్ర మార్పు చేయడం మొదలు పెట్టింది బీజేపీయేనన్న ఆయన.. కేసీఆర్ యజ్ఞాలు.. యాగాలు చేస్తారు అంతే.. కానీ, బీజేపీలా కాదన్నారు. ఇక, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగానే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు తమ్మినేని వీరభద్రం. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తున్నారు.. వారికి మద్దతుగా ప్రచారం చేస్తూనే.. వారు లైన్ తప్పి చేసే కామెంట్లను మాత్రం తప్పుబడుతున్నారు కామ్రేడ్స్.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!