Talasani Srinivas Yadav : పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Animal Husbandary, Fisheries and Cinematography Minister Talasani Srinivas Yadav Fired on Telangana BJP Leaders.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నిన్న తెలంగాణ మంత్రులు యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని పీయూష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎఫ్‌సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్‌కు బాధ్యత ఉందా? తెలంగాణలో పండేది బాయిల్డ్ రైస్. రా రైస్ కొంచెం ఉత్పత్తి అవుతది. దేశంలో ఆకలి తీర్చే పరిస్థితులు కేంద్రానికి ఉండాలి. తెలంగాణ బీజేపీ కొంటవ, చస్తావా అంటుంది అని ఆయన మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
దేశంలో బీజేపీలు రెండు ఉన్నాయా? అసలు బీజేపీ నేతలకు మెదడు ఉందా? కేంద్రంలో అధికారంలో ఇచ్చింది ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటానికా? అని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, దేశంలో పరిపాలన నడుస్తుందా? సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఒక్క రూపాయి అయిన తెచ్చినవా కిషన్ రెడ్డి? అని ఆయన ప్రశ్నించారు. ఒకట్రెండు ఉప ఎన్నికల్లో గెలువంగానే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోరని, టైమ్, అవకాశం వస్తే కేంద్రంలో ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. మీ నాయకులు నూకలు తింటారా, వాళ్ళు తింటామని ప్రజలకు చెప్పించండన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూకలు తింటారా? మీ ముఖానికి దేశంలో ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయన అన్నారు. జీఎస్టీ, డీ మానిటైజేషన్ తెచ్చి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేశారని, ధాన్యం కొనుగోలు రాజ్యాంగ పరమైన హక్కు.. మేమేమైన అడుక్కు తినే వాళ్ళమా? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్టగొట్టే కార్యక్రమాలు బీజేపీ నాయకులు చేయొద్దని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నూకలు తినిపించాలి. ఆ తర్వాత మిగతా వారికి చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ఇప్పటికి వందసార్లు పెంచారని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!