ఉద్యమంలో చెప్పి సీఎం అయ్యాక మర్చిపోయారా : ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన అన్నారు. జీవో 317 ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసిందని, వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
చిక్కుముడులు, అపోహలు, అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా చర్చలు జరపాలి. అప్పటివరకు ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ నేను రాజును నాకే అన్నీ తెలుసు.. నేను చెప్పిందే చేయాలి అని హుకుం జారీ చేస్తున్నారు. 3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. వీరి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వీరి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నారు ?ఉద్యమంలో చెప్పి సీఎం అయ్యాక మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!