Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బి.కె. హరిశ్ప్రసాద్ RSSపై తీవ్ర వ్యాఖ్యలు.
- RSS, జైష్-ఎ-మొహమ్మద్, తాలిబన్ మధ్య తేడా లేదని వ్యాఖ్య.
- మూడు సంస్థలు దేశంలో రిజిస్టర్ కాలేదని హరిశ్ప్రసాద్ ఆరోపణ.
- RSS శాఖల్లో వందేమాతరం, జాతీయ గీతం పాడరని విమర్శ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్ ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, జైష్-ఎ-మొహమ్మద్, తాలిబన్ మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ మూడు సంస్థలు దేశంలో రిజిస్టర్ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. దేశంలో ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ తన శాఖల్లో వందేమాతరం, జాతీయ గీతం పాడదని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయదని కూడా హరిప్రసాద్ ఆరోపించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్, నిధులు, కార్యకాలపాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్టర్ కానీ సంస్థలు వినియోగించడాన్ని నియంత్రించే బిల్లును కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు, కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య కూడా ఆర్ఎస్ఎస్పై తీవ్ంర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ వెయ్యి తలల విషసర్పం అని కులవాదం, మతతత్వం, మనువాదంతో సమాజాన్ని విషపూరితం చేసిందని ఆరోపించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్పలై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ బీజేపీ ఎంపీ ధర్మశిలాగుప్తా మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశం ముందు అని భావిచే సిద్ధాంతంతో పనిచేస్తుందని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, అభివృద్ధి కోసం సేవ చేస్తుందని అన్నారు. మాజీ బీజేపీ నేత బసనగౌడ పాటి కూడా హరిష్ ప్రసాద్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. జైషే మహ్మద్ లాగా ఆర్ఎస్ఎస్ ఎవరిపై బాంబులు వేసిందని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..