Suryapet Municipality: సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు 11 గంటలకు నిర్వహించాల్సిన అవిశ్వాస తీర్మానానికి అధికారులు హాజరు కాగా, కౌన్సిల్ సభ్యులు హాజరు కాలేదు… ప్రత్యేక సమావేశానికి కావలసిన కోరం కూడా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని మున్సిపల్ యాక్ట్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. 11 గంటల నుండి 30 నిమిషాల పాటు సమావేశ మందిరంలోని వేచి చూసిన అధికారులు…. కౌన్సిల్ సమావేశ ప్రాంగణానికి కౌన్సిలర్లు రాలేదని నిర్ధారించిన తర్వాత మధ్యాహ్నానికి ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేశారు జిల్లా కలెక్టర్ వెంకట్రావు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కౌన్సిలర్ల అంతా హైదరాబాదులో ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 ఎనిమిది మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో ఒకరు రాజీనామా చేయగా ప్రస్తుతం 47 మంది కౌన్సిలర్లతో పాలకవర్గం ఉండగా.. 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.. అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Kunamneni: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి,బిడ్డ మృతి.. చర్యలు తీసుకోవాలని కూనంనేని కాల్
ఖమ్మంలో ఇలా..
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ కురాకుల నాగభూషణం ఛైర్మెన్ గా వున్న సొసైటీ వి. వెంకటాయ పాలెం పై అవిశ్వాసం కు కొద్ది సేపటి లో ఓటింగ్ జరుగనుంది.. డిసిసిబి చైర్మన్ గా ఉన్న కూరాకుల నాగభూషణం వి వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్ గా కూడా ఉన్నారు అయితే సొసైటీ చైర్మన్ అయిన తర్వాత డైరెక్టర్ గా ఎన్నిక కావాలి ..ఆ డైరెక్టర్ డిసిసిబి చైర్మన్ అవుతారు.. ఈ నేపథ్యంలో సొసైటీ చైర్మన్ పై గా ఉన్న కూరాకుల నాగభూషణం పై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసు నేపథ్యంలో కొద్దిసేపట్లో ఓటింగ్ జరగనుంది. అయితే 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ సంబంధించిన సొసైటీ సభ్యులందరూ సొసైటీ డైరెక్టర్ మదూరి సైదు బాబు నాయకత్వంలో వైజాగ్ వరకు లో క్యాంపులు నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే బి వెంకటాయపాలెం సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు 11 గంటలకి సొసైటీ చైర్మన్ పదవి ఓటింగ్ జరగనుంది..
Read also: Viral Video : కదులుతున్న రైలుపై విన్యాసాలు.. ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
కోదాడలో ఇలా..
కోదాడ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు అడే పార్టీకి చెందిన చైర్మన్ వనపర్తి శిరీష పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా విపక్ష పార్టీల కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు అవిశ్వాస తీర్మానం కొరకు పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం అయింది.. ఈ సమావేశానికి 34 మంది కౌన్సిలర్ లు హాజరు కాగా అవిశ్వాస తీర్మానాన్ని అనుకూలంగా 29 మంది ఓటు వేయగా…. నలుగురు ప్రతికూలంగా…. ఒకరు గైర్ హాజరు కావడంతో ఈరోజు జరిగిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించిన అధికారులు ఈ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో సమర్పించనున్నారు… ఆ తర్వాత గెజిట్ ప్రకటన ఉంటుందని…. తదుపరి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసిన నేపథ్యంలో.. సంబంధిత పార్టీ సభ్యుల నుండి వివరణ కూడా అధికారులు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.
Bihar Crisis: ఈరోజు నితీష్ ప్లాన్ ఇదే..!