పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగటం ఏంటని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం 32 నింపి ఆ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో రికార్డు చేస్తారు.. బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసే వరకు ఏజెంట్లు అక్కడే ఉంటారు.. ఆ సీల్ మీద కూడా ఏజెంట్ల సంతకం తీసుకుంటారు.. ఇవన్నీ జరిగాయా అని అడుగుతున్నా.. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతిఒక్కరూ దీన్ని గురించి ప్రశ్నించకపోతే డెమోక్రసీ బ్రతకదని తెలిపారు.
Also Read:Fahadh Faasil : షిఖావత్ సార్ కు ఏమైంది.. ట్రాక్ తప్పిన ఫహాద్ ఫజిల్ కెరీర్..
ఇంకా ఎన్నికలు జరిపేదేమీ ఉండదు.. అధికార పార్టీ గుద్దుకోవటమే.. చంద్రబాబు తో అంటకాగుతున్న అధికారులు, ఎల్లో మీడియా.. ఇవాళ వీళ్లు ప్రజాస్వామ్యం కూని చేసి ఎన్నికలు జరిపించారు.. బందిపోటు దొంగల మాదిరిగా చొరబడ్డారు.. వాళ్లకు మించి చంద్రబాబు పులివెందులలో ఓట్లు వేయించారు.. దగ్గరుండి పోలీసులు పోలింగ్ చేయించారు.. మీరు ప్రజలకు మంచి చేశాము అనే నమ్మకం ఉంటే ఎన్నికలు రద్దు చేయండి.. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలని ఛాలెంజ్ చేస్తున్నా.. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కూని చేస్తున్నారు కాబట్టే మీకు నమ్మకం లేదు.. ప్రతీ బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ బయటపెట్టె దైర్యం ఉందా అని అడుగుతున్నా.. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడ్ని లీడర్ అనరు ఫ్రాడ్ స్టర్ అంటారు అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.