YS Sharmila Padayatra: నేడు సంగారెడ్డి, కంది మండలాల్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. సంగారెడ్డి మండలంలోని సదాశివనగర్‌లో ప్రారంభమై, ఎంఎన్ఆర్ కళాశాల నుంచి కంది మండలంలోని హనుమాన్ నగర్ కాలనీ, ఇస్మాయిల్ ఖాన్ పేట్, ఆరుట్ల, చిద్రుప్ప, బేగంపేటలలో కొనసాగనుంది. పాదయాత్రలో ప్రజలతో మాట్లాడనున్న షర్మిల రాత్రికి బేగంపేటలోనే బస చేయనున్నారు.
Read also: KA Paul: ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తా..
నిన్న సంగారెడ్డి పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్న వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ మూడు వందల రూపాయల చీరలను మహిళలకు ఇచ్చి మూడు తరాలకు చేస్తున్న అన్యాయాన్ని కప్పిపుచ్చుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఓ దొరికిపోయిన దొంగ అంటూ ఆరోపించారు. రేవంత్ , కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అని ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు కన్నెర్ర చేస్తే.. అప్పుడు మళ్లీ జైల్లో చిప్ప కూడు తినక తప్పదని రేవంత్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. అంతేకాకుండా తాను బీజేపీ వదిలిన బాణం అంటూ విమర్శలు చేసిన జగ్గారెడ్డి కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల.
Chennai: ఆత్మహత్య చేసుకోవడం ఎలా?.. నటించి చూపించబోయాడు.. కానీ..