KA Paul: ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Announced Bumper Offer: మునుగోడు నిరుద్యోగ యువతకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్‌తో పాటు అమెరికన్ విసాను ఉచితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం..మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 50 వేల మంది నిరుద్యోగులు తమ రెజ్యూమ్‌లు తీసుకొని, సెప్టెంబర్ 25న శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కి రావాలని సూచించారు. తన జన్మదిన కానుకగా ఇస్తోన్న ఈ సదవకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఇందులో బాగంగా.. నిన్న మునుగోడులో కేఏపాల్ 59వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం సభ నిర్వహించారు. 59 మందికి వీసా లక్క్కీడ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన వారిని అమెరికా పంపించనున్నారు.
Read also: Ktr to Meet Basar IIIT Students: నేడు బాసరకు కేటీఆర్.. ఐఐఐటీ విద్యార్థులతో సమావేశం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఒక బీసీ కుటుంబంలో పుట్టి, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్, సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పి.. ఇంతవరకూ ఆ హామీల్ని నెరవేర్చలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. అయితే.. ఉపెన్నికల్లో కోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా టీఆర్‌ఎస్ ఇంకా ప్రకటించాలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా.. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని.. నియెజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కేఏపాల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు.
PFI: పీఎఫ్‌ఐపై కూపీ లాగుతున్న ఈడీ.. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!