YS Sharmila: టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని అన్నారు. మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని తెలిపారు. తన పార్టీ వాళ్ళను పోలీసులు కొట్టారని, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ వాయిలెన్స్ కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారు? అని ప్రశ్నించారు. పాదయాత్రను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.
Read also: Father Kills Son: దారుణం.. ఆస్తి కోసం కొడుకు చంపిన కన్న తండ్రి
సీఎం కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కేసీఆర్ రిచేస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టారని ఆరోపించారు. ప్రగతి భవన్ పై రైడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామని అన్నారు షర్మిల. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని, మునుగోడు, హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టిందో విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. తాలిబన్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదని స్పష్టం చేశారు. ఆయన మగతనంతో నాకేం పని, పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తోంది.. నాకేమి అవసరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
Read also: #SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…
నన్ను మరదలు అంటే చెప్పుతో కొడతా:
నేను మంత్రి నిరంజన్ రెడ్డిని ఏం తప్పు అడిగిన.. నన్ను మరదలు అంటే చెప్పుతో కొడతా అని చెప్పా.. ఆయన కేసు పెడితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు.. నేను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇదేనా మహిళలకు ఉన్న గౌరవం.. నేను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అయితేనే కేసు పెడితేనే తీసుకోవడం లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంటి..? ఇదేనా తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. జెండా పట్టుకున్నందుకు తోటి విద్యార్థిపై దాడి