ఒటీటీల ప్రభావం ఎక్కువ అయ్యాకా కోర్ట్ రూమ్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒకటో రెండో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే రేంజులో ఉంటాయి. మిగిలిన సినిమాలన్నీ చాలా తక్కువ బడ్జట్ లో చుట్టేసే సినిమాలే కనిపిస్తుంటాయి. అయితే అతితక్కువ సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఈ కోవలోకే వచ్చేలా ఉంది ‘ముఖచిత్రం’ సినిమా. ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ కథ కథనం మాటలు రాసిన ‘ముఖచిత్రం’ సినిమాని గంగాధర్ తెరకెక్కించాడు. వికాస్, ప్రియ వడ్లమని, చైతన్య రావు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ సినిమాలో ‘విశ్వక్ సేన్’, ‘బొమ్మలి రవి’ లాయర్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ‘ముఖచిత్రం’ సినిమాపై అంచనాలని పెంచింది.
డిసెంబర్ 9న థియేటర్స్ లోకి వస్తున్నాం అంటూ సడన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన చిత్ర యూనిట్, ఉన్నపళంగా ‘ముఖచిత్రం’ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఒక సినిమా ఆడియన్స్ లోకి వెళ్లాలి అంటే ట్రైలర్ బాగుండాలి, ఇది పర్ఫెక్ట్ గా ఫాలో అయిన చిత్ర యూనిట్, ‘ముఖచిత్రం’ ట్రైలర్ ని సూపర్బ్ గా కట్ చేశారు. కథ చెప్పినట్లే చెప్పి, జరిగింది అది కాదు అని ట్విస్ట్ ఇచ్చిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి, ప్లే ఇంటరెస్టింగ్ గా ఉండబోతుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని చూడబోతున్నాం అనే నమ్మకాన్ని కలిగించడంలో ‘ముఖచిత్రం’ ట్రైలర్ సక్సస్ అయ్యింది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, కాల భైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.
ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్ ని ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది, అతను ఆమెని కాదని సాంప్రదాయమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇంతలో ఒక రోడ్ ప్రమాదం జరుగుతుంది, హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి కోమా లోకి వెళ్లి చనిపోతుంది. మొదట రిజెక్ట్ చేయబడిన అమ్మాయి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోని చనిపోయిన భార్య స్థానంలోకి వచ్చి హీరోపైన కేస్ పెడుతుంది. ఇక్కడి నుంచి కేస్ ఎలాంటి మలుపు తిరిగింది అనే లైన్ తో ‘ముఖచిత్రం’ సినిమా తెరకెక్కింది. అయితే ట్రైలర్ చూస్తుంటే ఒక లైన్ లో చెప్పినంత ఈజీగా కాకుండా ముఖచిత్రం కథలో చాలా మలుపులు ఉన్నట్లు ఉన్నాయి. అవేంటో తెలియాలి అంటే ముఖచిత్రం సినిమాని డిసెంబర్ 9న థియేటర్స్ లో చూడాల్సిందే.