మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉంటాయి. హీరో స్మోక్ చేయడు, విలన్ చనిపోడు, పురాణాల రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితో పాటు కామన్ గా ఉండే మరో పాయింట్, త్రివిక్రమ్ సినిమా టైటిల్. ‘అ’తో మొదలయ్యే పేర్లని టైటిల్స్ గా పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటైన పని. అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… ఇవి త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్. ఇందులో ‘అజ్ఞాతవాసి’ తప్ప మిగిలిన సినిమాలన్నీ హిట్ అయినవే. అందుకే తన సెంటిమెంట్ ని ఎక్కువగా నమ్మే మాటల మాంత్రికుడు, మహేశ్ బాబుతో చేస్తున్న #SSMB28 సినిమాకి కూడా ‘అ’ అక్షరంతోనే టైటిల్ పెట్టాడని సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి “అసుర సంధ్యా వేలా” అనే టైటిల్ ని ఫైనల్ చేయాలని చూస్తున్నారట.
‘హిరణ్యకశిపు’ బ్రహ్మని మొక్కి, కొన్ని శక్తులని తెచ్చుకున్నాడు. అందులో పగలు కానీ రాత్రి కానీ, మనిషి కానీ మృగం కానీ, ఆయుధం కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కాని తనని ఎవరూ చంపకూడదు అనే వరం తెచ్చుకున్నాడు. ఈ వరం కారణంగా హిరణ్యని ఎవరూ చంపలేకపోతే… విష్ణుమూర్తి, నరసింహా అవతారం ఎత్తి… పగలు, రాత్రి కాని “సంధ్యా సమయంలో” హిరణ్య కశిపుని చంపుతాడు. పగులు అంతమయ్యే, రాత్రి మొదలయ్యే సమయంలో వచ్చే కాలాన్ని “సంధ్యా కాలం” అంటారు. ఈ సంధ్యా సమయంలో “అసుర సంహారం” జరిగింది కాబట్టే దీన్ని “అసుర సంధ్యా” అంటారు. ఇలాంటి ఒక ఎలిమెంట్ ని తీసుకోని టైటిల్ గా పెట్టి మహేశ్ తో సినిమా చేస్తున్నాడట త్రివిక్రమ్. మరి “అసుర సంధ్య వేళలో” మహేశ్, ఎవరిని చంపుతాడు? ఎందుకు చంపుతాడు అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. పూజా హెడ్గే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 8 నుంచి మొదలుకానుంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు కూడా ‘అ’ అక్షరంతో ‘అతడు’, ‘అర్జున్’, ‘అతిథి’, ‘ఆగడు’ సినిమాలు చేశాడు. ఇందులో రెండు హిట్స్ రెండు ఫ్లాప్స్ ఉన్నాయి.