Mahabubnagar Crime: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతుంది. కల్తీకల్లు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. బోయపల్లి కేంద్రంగా క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలం, అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి కనుసన్నల్లోనే అమ్మకాలు నిర్వహించడం సంచలనంగా మారింది. 50 మంది కి పైనే కల్తీకల్లు బాధితులు ఉండటం గమనార్హం. భాదితులు ఆస్పత్రికి ఎక్సైజ్ అధికారులు కట్టడి చేసారు. కల్తీ కల్లు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినా కానీ.. దీనిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమాలు వ్యక్తం మవుతున్నాయి. అధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించమంటున్నారు.
Read also: Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మంది ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.. వీరంతా పట్టణ సమీపంలోని ఓ కల్లు దుకాణంలో కల్లు తాగారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం నలుగురిని పంపించి.. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. కల్తీ కల్లు తయారీకి సీహెచ్, అల్పాజోలం వంటి మత్తు పదార్థాలు వాడుతున్నారు. శుక్రవారం కల్లు కాంపౌండ్‌లోని వ్యక్తులు కల్తీ కల్లు తయారీకి రోజుకి సరిపడా మత్తు పదార్థాలు కలిపి తాగి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం. ఇంటికి వెళ్లిన తర్వాత పిచ్చి పిచ్చిగా నటించాడు. నోరు మెదపడం, వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాధితులు శుక్రవారం ఆసుపత్రికి వచ్చినప్పటికీ అధికారులు, ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
Read also: Tea Cups: బాబోయ్ పేపర్ కప్పులు..
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో బోయపల్లి, దొడ్లోనిపల్లి, కోయనగర్, తిమ్మసానిపల్లి తదితర ప్రాంతాల్లోని మట్టి సమ్మేళనాల నమూనాలను అధికారులు సేకరించి.. సీహెచ్, అల్పాజోలం కలిపారా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు పరీక్ష (స్పాట్ టెస్ట్) చేశారు. ఎలాంటి ఫలితం లేదని, మరేదైనా డ్రగ్స్ కలిపాయో లేదో నిర్ధారించేందుకు శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపామని అధికారులు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వచ్చి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తురాజ్‌గౌడ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పది మంది రోగులు వచ్చినట్లు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి సూపర్‌వైజర్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు. వారంతా స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారని, ప్రాథమిక చికిత్స అనంతరం నలుగురు వెళ్లారని, మిగిలిన వారిని ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరంతా ఆల్కహాలిక్ విత్‌డ్రాయిల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు.
Diet risk: అతిగా ఆశ పడకండి.. ప్లీజ్ తినడం మానేయకండి