Drunk and Drive in Hyderabad: మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అరికట్టడానికి పోలీసులు నడుం బిగించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. వారాంతాల్లో మరిన్ని తనిఖీలు చేస్తున్నారు. ఇందులో పట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టు ముందు నిలబెడుతున్నారు. ఛార్జ్ షీట్లు దాఖలు చేసి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు. వీరితో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. వీకెండ్ కావడంతో నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
Read also: Tea Cups: బాబోయ్ పేపర్ కప్పులు..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేపట్టారు. మందుబాబులు పోలీసులను చూసి పరుగులు పట్టారు. వాహనాలను వేరే రూట్లల్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. వారందరిని చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. మందుబాబులను పట్టుకుని బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయగా పోలీసులె నిర్ఘాంతపోయారు. పోలీసుల తనిఖీల్లో పదుల సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసుల చర్యలు తీసుకున్నారు. అయితే మరి కొందరు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం సేవించి ఉన్న వాళ్లంతా.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకు బ్రీత్ టెస్టులు అంటూ గొడవకు దిగారు. బ్రీత్ టెస్టు చేసేంతవరకు వాహనాలు ముందుకు కలవవని తెగేసి చెప్పడంతో ఏదారి లేక బ్రీత్ టెస్టులు చేశారు మందు బాబులు. అయితే ఈ తనిఖీల్లో వేల సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు.
Political Turmoil: ప్రశాంతనిలయంలో అగ్గి రాజేసింది ఎవరు?