Reels makers: రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. వివరాలు ఇవిగో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels makers: ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రీళ్ల ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూత్ అంతా ఈ రీల్ ట్రెండ్ కి అడిక్ట్ అయిపోయారు. అయితే.. ఈ రీళ్లకు లక్షల్లో వ్యూస్ రావడం.. చాలా మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారు ఏం చేసినా చాలా మంది ఫాలో అవుతారు. అయితే.. ఇలాంటి రీళ్లు తయారు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాటిని చూసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తెలంగాణ సర్కార్ ఈ రీళ్లు తయారు చేసే వారికి తీపి కబురు వినిపించింది.
Read also: NTR: షార్ట్ గ్యాప్ అంతే… దేవర వచ్చేస్తాడు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అయితే తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతోంది. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. రీళ్ల ట్రెండ్ నడుస్తుండగా.. ఈ సందేశాన్ని ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. ‘‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’’ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. 18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ కు బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను ఈ రీళ్లలో చూపించడమే ఈ పోటీ ఉద్దేశం. అయితే.. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. ఈ వీడియోలను జూన్ 20లోపు పంపాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడతాయి. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 ప్రైజ్‌గా ఇవ్వబడుతుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొంది.
IPL 2023 Final: నేడు ఐపీఎల్ ఫైనల్.. ఈ రోజు కూడా వర్షం పడితే జరిగేది ఇదే..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు