కరోనా తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజ్ పున:ప్రారంభం అయినప్పట్టికీ కాలేజ్‌లో ఉన్న సమస్యలపై ప్రన్సిపాల్ సిబ్బంది దృష్టి పెట్టలేదని, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాలేజ్ సమస్యలపై అనేక సార్లు మెమొరాండం ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినందుకు ప్రిన్సిపాల్ బ్లాక్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలేజ్ ఆవరణలో ఎక్కడికక్కడ గడ్డి పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయన్నారు. క్లాస్ రూంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఆట సామగ్రి, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.
క్లాసులను బైకాట్ చేసి 300 మంది తో ధర్నా నిర్వహించారు. చాలా సేపు ధర్నా విరమించకపోవడంతో కాలేజ్ ప్రన్సిపాల్ సమస్యలను సోమవారం లోపు పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నాను విరమించారు. సమస్యలను పరిష్కరించకుంటే మరోసారి పెద్ద ఎత్తున వివిధన నిరసన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులు ప్రన్సిపాల్‌ను హెచ్చరించారు.