తెలంగాణ సీపీజీఈటీ-2021లో మొదటి విడతలో సీట్లు సాధించిన వారు కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదిలను అధికారులు పొడిగించారు. రాష్ర్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉతీర్ణులై తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో ఈనెల15వ తేది వరకు రిపోర్టు చేయవచ్చని ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. కాగా అంతకముందు ఈ గడువు ఈనెల10 వరకు ఉండగా మరో 5 రోజులు పాటు పొడిగించినట్లు…
కరోనా తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజ్ పున:ప్రారంభం అయినప్పట్టికీ కాలేజ్‌లో ఉన్న సమస్యలపై ప్రన్సిపాల్ సిబ్బంది దృష్టి పెట్టలేదని, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాలేజ్ సమస్యలపై అనేక సార్లు మెమొరాండం ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినందుకు ప్రిన్సిపాల్ బ్లాక్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలేజ్ ఆవరణలో ఎక్కడికక్కడ గడ్డి పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయన్నారు. క్లాస్ రూంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఆట సామగ్రి, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వంటి అనేక సమస్యలు…