నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం దాదాపు ఖరారైనట్లే.. తండ్రి బాలకృష్ణ ఇప్పటికే చెప్పినట్లుగా, తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. అయితే, తాజా హాట్ అప్డేట్ ఏమిటంటే.. మోక్షజ్ఞ తొలి సినిమాకే ఒక భారీ, పవర్‌ఫుల్ విలన్‌ని రంగంలోకి దించుతున్నారట. ఆయనెవరో కాదు..
కన్నడ సూపర్ స్టార్, సెన్సేషనల్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర అంటా. ఈ వార్త నిజమైతే, సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయనడంలో సందేహం లేదు. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నారని, ఆయన క్యారెక్టర్ చాలా శక్తివంతంగా ఉండడమే కాకుండా, ఆయన లుక్ కూడా ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేసే విధంగా కొత్తగా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య చాలా ప్లాన్డ్‌గా ఉన్నారని, ఇప్పటికే తన మైండ్‌లో మోక్షజ్ఞ కోసం ఐదు, ఆరు స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయని గతంలోనే చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో, సాయి మాధవ్ బుర్రా పవర్ఫుల్ డైలాగ్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు ఉపేంద్ర లాంటి స్టార్ విలన్ ఫిక్స్ అయితే, మోక్షజ్ఞకు అది నిజంగా ఒక బెస్ట్ డెబ్యూ అవుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన కోసం నందమూరి అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.