సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని.. రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై మోడీకి విద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
1. నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో ఆంక్షలు విధించారు పోలీసులు. నేడు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. 2. నేడు సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. 3. నేడు ఒంగోలులో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. 4.…
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న స్నాతకోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 26 తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే..…
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. ప్రధాని మోడీ టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు రానున్నారు ప్రధాని మోదీ. ఐఎస్‌బీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. తొలిసారి ఐఎస్‌బీ మొహాలితో కలిసి ఐఎస్‌బీ హైదరాబాద్ సంయుక్త గ్రాడ్యూయేషన్ సెరిమనీ ఏర్పాటు చేసింది. 2022 పోస్ట్…