Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
- వ్యూహాలు మార్చిన పాకిస్తాన్ ఐఎస్ఐ..
- విడాకులు తీసుకున్న, నిరుద్యోగ మహిళలే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan ISI Honey Trap: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) భారతీయ మహిళలపై హనీట్రాప్ చేస్తోంది. మహిళల బలహీతలు ఉపయోగించుకుని వారిని తమ నెట్‌వర్క్‌లో భాగం చేసుకుంటోంది. విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరితనంతో ఉన్న వారు, నిరుద్యోగ మహిళల్నే ఐఎస్ఐ టార్గెట్ చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్, పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళల అరెస్టుతో, ఐఎస్ఐ ‘‘హనీట్రాప్’’ అంశం వెలుగులోకి వచ్చింది.
జైపూర్‌కు చెందిన 38 ఏళ్ల బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా, పంజాబ్ గురుదాస్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల మహక్దీప్ కౌర్‌లను పాకిస్తాన్‌కు చెందిన హ్యాండర్లు ‘‘ప్రేమ, డబ్బు, కొత్త జీవితం’’ అనే ఆశ చూపి గూఢచారులుగా నిమించుకుంటున్నట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
- TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
- Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
ప్రేమ పేరుతో ఉచ్చు..
బబిత విడాకుల తర్వాత జైపూర్ శివార్లలోని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. నిరుద్యోగం, తీవ్ర నిరాశలో ఉన్న ఈమెకు సోషల్ మీడియాలో జైషే మహ్మద్‌తో సంబంధలు ఉన్న పాకిస్తాన్‌కు చెందిన ఒక హ్యాండర్తో పరిచయం ఏర్పడినట్లు యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అధికారి వెల్లడించారు. రెండేళ్ల పాటు ఆమెను ప్రేమించినట్లు నటిస్తూ, పెళ్లి చేసుకుంటానని చెబుతూ ప్రలోభపెట్టినట్లు తేలింది. ఆన్లైన్లో మతం మార్చుకోవడానికి, కల్మా పఠించడానికి, ఖదీజా అనే పేరు స్వీకరించడానికి ఆమెను ఒప్పించాడు. ప్రేమ పేరుతో మతం మార్పిడి..నేపాల్, సౌదీ అరేబియా లేదా యూఏఈ మీదుగా పాకిస్తాన్‌కు ఆమె ప్రయాణ ఏర్పాట్లు చేస్తానని, అందుకు అయ్యే ఖర్చులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారా భరిస్తానని అతను హామీ ఇచ్చాడు. జూన్ 21న అరెస్టు కావడానికి ముందు ఆమె మూడు భారతీయ మొబైల్ నంబర్లకు సంబంధించిన వాట్సాప్ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లను (OTPలు) జైషే మహమ్మద్ కమాండర్‌తో పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సరిహద్దు అవతలి నుంచి పనిచేసే వ్యక్తులు భారతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి, నిఘా నుంచి తప్పించుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాల కంటెంట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రైల్వే ట్రాక్‌పై బాంబ్ పేల్చిన మహక్దీప్ కౌర్..
బబితా కేసు తర్వాత ఇటీవల శ్రీగంగానగర్ జిల్లాలోని రామ్సింగ్పూర్ గ్రామం సమీపంలో అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో ట్రాక్‌పై బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మహక్దీప్ కౌర్ ఈ ఘటన వెనక ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. బబితా కేసులో లాగే ఈ కేసులో కూడా మహక్దీప్ భర్త డ్రగ్స్ కేసులో జైలులో ఉన్నాడు. ఈ క్రమంలోనే షా, చాచా అనే పాకిస్తాన్ హ్యాండర్లతో పరిచయం ఏర్పడింది. ప్రేమ, డబ్బు ద్వారా ఆమెను వలలోకి దింపారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్‌పై దాడి చేసింది.
మహిళలే ఎందుకు టార్గెట్..?
పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ హ్యాండర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ , వాట్సాప్ వంటి వేదికల్ని ఉపయోగించి వ్యక్తగత, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళల్ని గుర్తించి వారిని సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళల్ని టార్గెట్ చేయడం సులభమని, యువకులతో పోలిస్తే సరిహద్దు వద్ద మహిళల కదలికల్ని అధికారులు పెద్దగా పట్టించుకునే అవకాశాలు తక్కువ అని చెప్పారు. ప్రేమ, ఆర్థిక సహాయం, విదేశాల్లో కొత్త జీవితం అనే ఆశలు చూపించి మహిళల్ని ట్రాప్ చేస్తున్నారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
-
Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
-
India Rafale Jets: 4 రాఫెల్ జెట్లు మిస్సింగ్.. బ్రిటీష్ నివేదికపై మాజీ ఎయిర్ మార్షల్ ఫైర్!
-
YS Jagan: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు.. హర్షం వ్యక్తం చేసిన జగన్..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!