Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
- సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- ఆయిల్ ఫాం కర్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చిన సీఎం రేవంత్
- రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేశాం. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa Funds Released : సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. జిల్లాలో రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 3,600 కోట్ల నిధులను నేరుగా జమ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
అభివృద్ధి పనుల విషయానికి వస్తే, సిద్దిపేట , గజ్వేల్ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు, సిద్దిపేట మున్సిపాలిటీలో రూ. 141.34 కోట్లతో నీటి సరఫరా , భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఎన్సాన్‌పల్లిలో రూ. 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి, , రూ. 3.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే నంగునూరు మండలం గట్లమల్యాల , సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో కొత్తగా నిర్మించిన పిహెచ్‌సి (PHC) భవనాలను కూడా ఆయన ప్రారంభించారు.
Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కొండపాకలో రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే క్రమంలో మర్కూక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అదనపు మౌలిక సదుపాయాల కోసం రూ. 16.62 కోట్లను కేటాయించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ మర్కూక్ , జగదేవ్‌పూర్ మండలాల్లో సుమారు రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని, ఈ అభివృద్ధి పనులు జిల్లా రూపురేఖలను మారుస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!