హైదరాబాద్ వేదిక ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగబోతున్నాయి.. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు జరుగుతోంది.. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక, ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ చేరుకున్నారు.. ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో దేశంలో జరుగుతున్న అనేక ఘటనలపై కీలక చర్చ జరగబోతోంది. ఈ సమావేశంలో యాభైకి పైగా ఉన్న ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగాలకు చెందిన జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో పాటు బీఎల్ సంతోష్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, బీఎంఎస్, కిసాన్ సంఘ్, విద్యా భారతి, సేవిక సమితి లాంటి సంస్థలకు చెందిన అగ్రనేతలు హాజరుకాబోతున్నారు.. ఆయా క్షేత్రాలలో జరుగుతున్న కార్యక్రమాలు… ఎదురవుతున్న అనుభవాలపై చర్చ సాగించనున్నారు. పర్యావరణం, కుటుంబ ప్రభోదన్, సామాజిక పరిస్థితుల వంటి కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించడంపై కూడా చర్చించనున్నారు.
Read Also: ఆ విషయంలో ఏపీయే ముందు..! ఆ తర్వాతే తెలంగాణ, గుజరాత్..
అయితే, ఆర్ఎస్ఎస్.. హైదరాబాద్‌నే ఎందుకు ఎంచుకుంది అనే చర్చ సాగుతోంది.. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్.. అయితే, తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తరుణంలోనే హైదరాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు నిర్వహిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసవరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కీలక నేతలకు పదోన్నతులతో పాటు బదిలీలు కూడా భారీగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, హైదరాబాద్ వేదిక సమావేశాలు జరుగుతుండడంతో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగం అయిన బీజేపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహించిన తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెబుతుంటారు.. ఈ సారి హైదరాబాద్ దీనికి వేదిక కావడంతో ఆలాంటి వ్యూహరచనతోనే ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. ఈ సమావేశాలకు తెలంగాణలో బీజేపీ కీలక నేతలు కూడా హాజరుకాబోతున్నట్టుగా తెలుస్తోంది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇలా అంతా వస్తే.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.. ఇప్పటికే ఓవైపు పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుతాన్ని ఇరకాటంలో పెడుతోంది బీజేపీ.. ఇక, ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఏం చర్చిస్తారు..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.