Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, ‘మీటూ’ ఉద్యమకారిణి చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. చిరంజీవి పై గౌరవం ఉంచుతూనే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న చీకటి కోణాలను ఆమె బట్టబయలు చేశారు.
Also Read : Sirai: బలగం రేంజ్ ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ డ్రామా!
Also Read
చిన్మయి తన పోస్ట్‌లో స్పందిస్తూ.. ‘మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి.. ‘కమిట్‌మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇక్కడ అవకాశాలు రావు. మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం ఇక్కడ సర్వసాధారణం’ అని కుండబద్దలు కొట్టారు. చిరంజీవి గారి తరం వేరని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని, కానీ నేటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతూ చిన్మయి కొన్ని షాకింగ్ ఉదాహరణలు ఇచ్చారు.. ‘ఒక ప్రముఖ వ్యక్తి ఒక ఫిమేల్ మ్యూజిషియన్‌ను స్టూడియోలో లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణభయంతో సౌండ్ బూత్‌లో తనను తాను లాక్ చేసుకుంది. మరొక సీనియర్ వచ్చి కాపాడే వరకు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ఈ రంగాన్నే వదిలేసింది. అలాగే ఒక ప్రముఖ గాయకుడు ఎటువంటి ప్రేరేపణ లేకుండా మహిళలకు తన పురుషాంగం ఫోటోలు పంపి, లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తుంటాడు. ఇలాంటి నేరస్తులకు సమాజం మళ్ళీ రెడ్ కార్పెట్ వేస్తుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన వ్యక్తిగత అనుభవం గురించి చెబుతూ.. లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించినప్పుడు తన తల్లి అక్కడే ఉందని, తల్లి పక్కనే ఉన్నా మగవారి బుద్ధి మారదు అనడానికి ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోకుండా బాధితులను అవమానించడం బాధాకరమని చిన్మయి అన్నారు. ‘ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు.. ఇక్కడ పని ఇవ్వాలంటే సెక్స్ కోరుకునే పురుషుల ఆలోచనా ధోరణే పెద్ద సమస్య’ అని ఆమె తన సుదీర్ఘ పోస్ట్‌ను ముగించారు.
Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ – a word that means completely different in the film industry.
If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being…
— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2026
తాజావార్తలు
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?