12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల తరఫున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీది అని అన్నారు రేవంత్ రెడ్డి. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానం అని అన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాకే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది అని విమర్శించారు.
షుగర్ ఫ్యాక్టరీ నడపలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎం నడిపిస్తారని విమర్శించారు. కెసిఆర్ అవసరం లేని వాటికి ఎక్కువగా అప్పులు చేసి.. ఆయనకు ఎందులో లాభం ఉందో అది చేసుకున్నాడని విమర్శించారు. రైతుల మొత్తం అప్పు 30 వేల కోట్ల వరకు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత నాలుగేళ్లలో బ్యాంకులకి తిరిగి చెల్లించుకుంటామని తెలిపారు.
65 యేండ్ల పాలనలో తెచ్చిన మెరుగైన వ్యవస్థను కెసిఆర్ ద్వంసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ లో చెరుకు ,పసుపు..కందులు..జొన్నలు సాగు మాయం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ వరి సాగు చేయడం పెరిగింది.. ఇదేదో నాదే గొప్ప అని చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరానికి కోటి ఎకరాలకు సాగు నీరు అందించిన అని కెసిఆర్ చెప్తున్నాడు, 30 లక్షల పంపు సెట్లు ఎందుకు వాడుకలో ఉన్నాయి చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కుని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని నిప్పులు చెరిగారు.
ప్రజల తరుపున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తెస్థం మన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీ ది అని గుర్తు చేశారు. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానమే నని రేవంత్ కొనియాడారు. షుగర్ ఫ్యాక్టరీ ..కెసిఆర్ సీఎం అయ్యాకే మూత పడ్డాయని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీనే నడప లేని కెసిఆర్.. ప్రభుత్వాన్నీ ఏం నడిపిస్తారని ఎద్దేవ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అడవికి గొర్రెలు మేపడానికి వెళ్తే.. ముసుగు దొంగలు కొన్ని దొంగతనం చేస్తారు… గొర్రెల కాపరికి గొర్రెను ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసు అని రేవంత్ అన్నారు. ముసుగు దొంగ నడుము విరగొట్టడం ఎలాగో నాకు తెలుసని పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఫార్మర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని , రైతు కమిషన్ ..రైతు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామన్నారు రేవంత్ రెడ్డి.