ఎప్పుడు రాజకీయాలతో బిజీ బిజీ గా వుండే మన రాజకీయ నాయకులు స్టేప్పులేస్తే ఎలావుంటుంది. ఓ రేంజ్ లో వుంటుంది కదూ. సినిమాలో మన హీరోలు చూసే స్టెప్పులు , వారు చెప్పే డైలాగులు , ఫైటింగ్ లు.. అన్నీ కూడా.. డైరెక్టర్, డ్యాన్సర్లపై ఆధారపడి వుంటుంది. కానీ.. ఒరిజనల్ గా అదే మన కళ్లముందు జరిగితే.. వావ్ అంటూ నోరు అలా తెరుచి, కళ్లార్పకుండా.. చూస్తూ వుండిపోతాం. మన హీరోలు విజిలేస్తే సుమోలు, ట్రాక్టర్లు రైయ్‌మని గాల్లో ఎగురుతాయి… ఇక సాంగ్ కు స్టెప్పులేస్తే ఇక విజిల్సే.. కాలు కదిపితే చాలు దుమ్ము రేపాల్సిందే. కళ్ళు ఎర్రచేస్తే చాలు ఎదుటి వాడి గుండె దడదడ లాడాల్సిందే.. ఇది మన హీరోలకున్న క్రేజ్.. ఇలా మన సినిమాల గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే..
కానీ.. ఆసినిమా చూడాలంటే మనం మనీ పెట్టి చూడాలి. కానీ.. మన రాజకీయ నాయకుల్లో కూడా హీరోలకు ఏం తక్కువ కాదంటే నమ్ముతారా.. మీరు నమ్మిన నమ్మక పోయిన ఇదే నిజం. రాజకీయాల్లో.. సభలు, సమావేశాలతో బిజీ బిజీగా వుండే మన నాయకులు పెళ్ళిళ్ళకు హాజరయితేనే.. పెళ్ళి ప్రాంగణం అంతా దద్దరిల్లు తుంది. అంత బిజీ షెడ్యూల్లో కూడా సమయం కేటాయించి ప్రజల అండగా ..ప్రజల మనషులమని, మీలో ఒక్కడినని తెలుపుతుంటారు. అలాంటి రాజకీయ నాయకులకు సలామ్ కొట్టాల్సిందే. ఇదంతా సరే కానీ అసలు విషయానికి వద్దాం..
హీరో చెప్పే పంచ్ డైలాగులకు ఆయన తక్కువ కాదు.. స్టేట్ ఎక్కితే సభ ప్రాంగణం, సభా స్థలి దద్దరిల్లాల్సిందే. ఆయన మాటకు ఎదుటివాడు ఖంగుతినాల్సిందే. ఆయన మాటల గంభీరానికి ఎదుటివారు మాటలకు సంకేళ్ళు పడాల్సిందే. ఆయన నడిచే నడక ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి దాయకమే. న్యాయం కోసం పెద్ద చిన్న అనే తేడాలేకుండా ప్రశ్నలతో ముంచెత్తుతాడు. ఆయన ప్రశ్నలకు ఎదుటివాడు ముందుకు రావడానికి కూడా జంకుతాడు. ఖలేజా వున్న వ్యక్తంటే మన తెలంగాణలో ఆయనకు ఆయనే సాధ్యం. అలాంటి వ్యక్తి తీన్మార్ వేస్తున్న డబ్బులకు కర్రసాము చేస్తే ఎలావుంటుంది. ఓ రేంజ్ లో వుంటుంది కదూ.. ఇంతకీ ఆయన ఎవరనేగా మీ ప్రశ్న . అదేనండి మనం రేవంత్ అన్న.
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్న కొడుకు వివాహ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా రేవంత్ రెడ్డి కర్ర సాము చేశారు. కర్రసాము చేస్తున్న రేవంత్ రెడ్డి చూసి అందరూ షాక్ తిన్నారు. అలా చూస్తూ వుండి పోయారు. తీన్మార్ డబ్బులకు ఓరేంజ్ లో కర్రసాము స్టేప్పులు వేయడం పెళ్ళి వేడుకలో ఆకర్షణ అయ్యింది. రేవంత్ అన్ననా మజాకా అంటూ.. విజిల్స్ వేస్తూ అన్నా .. నువ్వు తోపు అంటూ చప్పట్లు కొట్టారు. రేవంత్ రెడ్డి తీన్మార్ వేస్తున్న వీడియో ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్రతీసుకుని తిప్పుతున్న తీరు ఓ రేంజ్‌లో వుందంటూ కొందరు, మిర కొందరు రేవంత్ అన్నన్నా లేదా కొండల్ రెడ్డి అన్నన్నా అంటూ.. కామెంట్ల వర్షం కురిపిస్తోంది.