CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆయన, “చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అవి ఎక్కడికీ పోవు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Mark: ఆసక్తికరంగా కిచ్చా సుదీప్ “మార్క్” టైటిల్ గ్లింప్స్
“నవ్వుతూ కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. కానీ చేసిన పాపాలు ఊరికే పోవు. తప్పకుండా అనుభవించాల్సిందే. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్న అంతర్గత గొడవలపై కూడా ఆయన స్పందించారు. “మీ పంపకాలలో వచ్చిన పంచాయతీ మీరు పూడ్చుకోవాలి. మీ కుటుంబంలో, మీ వర్గంలో ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. ఆ విషయాల్లో మమ్మల్ని లాగకండి. మా ప్రభుత్వానికి, నాకు ఎలాంటి ఆసక్తి లేదు” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల వెనుక తాము ఉన్నారన్న ఆరోపణలపై కూడా సీఎం స్పందించారు. “హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నాడు అంటారు… మరొకరు కవిత వెనుక ఉన్నాడని అంటారు. నిజానికి నేను నాయకుణ్ణి. నేనుంటే ముందుంటా. మా వాళ్లకు తోడుంటా. అంత చెత్త గళ్ళ వెనుక నేను ఎందుకు ఉండాలి? నాలుగు కోట్ల ప్రజల వెంట నేను ఉన్నాను, వారికోసం పని చేస్తాను” అని చెప్పారు. ప్రతిపక్షాలపై మరోసారి కఠినంగా విమర్శలు చేస్తూ, “మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. మీ పార్టీ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటిది. కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Ukraine-Russia: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు.. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగం