TPCC Chief Revanth Reddy Made Comments on Chief Minister K.Chandrashekar Rao.
తెలంగాలణలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదలు సంభవించి గ్రామాల్లోకి నీరు వచ్చి చేరింది. కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటిస్తున్న సమయంలో మాట్లాడుతూ.. ఈ భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ లో వరదల్లో చనిపోయిన జర్నలిస్టు కుటుంబంకు తెలంగాణ కాంగ్రెస్ తరపున లక్ష రూపాయల పరిహారం అందిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
Etela Rajender : అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నాం
విధిలేని పరిస్థితి లో కేసీఆర్ ప్రగతి భవన్ గేటు దాటారని ఆయన విమర్శించారు. పంట నష్టంపై కేసీఆర్ పరిహారం ప్రకటించలేదని, ప్రజల ప్రాణాలు అంటే కేసీఆర్ కు లెక్కలేదన్నారు. గోదావరి పరిహరిక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగిందని …దీని వెనుక విదేశీ కుట్ర ఉందని కేసీఆర్ అంటున్నారు. దీనిపై కేసీఆర్ దగ్గర పూర్తి సమాచారం ఉందని అనుకుంటున్న. వెంటనే ఈ విదేశీ కుట్రపై పీఎం మోడీ విచారణ జరపాలి. సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్రపై ఉన్న సమాచారం రా సంస్థకు అందించాలి. జేమ్స్ బాండ్ 006…కేసీఆర్.. కేసీఆర్ సమాచారం ఇవ్వకుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.